భారతదేశం, ఆగస్టు 13 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 13 ఎపిసోడ్ లో.. కార్తీక్ ఇంటి నుంచి బయటకు వచ్చిన జ్యోత్స్న క్యాబ్ బుక్ చేసేందుకు ట్రై చేస్తుంది. క్యాబ్ సర్వీస్ లేదు, క్యాన్సిల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఇంటికి వెళ్లాలని జ్యోత్స్న అనుకుంటుంది. అప్పుడే స్కూటీపై సూరజ్ వస్తాడు. వర్షం వచ్చేలా ఉంది. స్కూటీ ఎక్కమని సూరజ్ అడిగితే జ్యోత్స్న వద్దంటుంది.

స్కూటీపై మళ్లీ వస్తా లిఫ్ట్ అడగమని జ్యోత్స్నతో సూరజ్ అంటాడు. ఇది నీ స్కూటీ, నేను డ్రైవర్ అనుకో. నేను పరాయివాడిని అనుకో. లిఫ్ట్ అడుగు అని ఎలాగోలా జ్యోత్స్న స్కూటీ ఎక్కేలా చేస్తాడు సూరజ్. స్కూటీ అద్దంలో నుంచి జ్యోత్స్నను చూస్తూ సైట్ కొడతాడు సూరజ్.

జ్యోత్స్న, సూరజ్ ఇంటికి చేరుకుంటారు. నీ మనసులో ఎవరూ లేరని నన్ను నమ్మించడానికి చాలా కష్టపడుతున్నట్లున్నావ్ అని స...