భారతదేశం, ఆగస్టు 12 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 12 ఎపిసోడ్ లో.. లగేజీతో ఇంటి నుంచి వెళ్లిపోయిన జ్యోత్స్న, కార్తీక్ ఇంటికి వచ్చి షాక్ ఇస్తుంది. జ్ణాపకాలు ఇచ్చి వెళ్లేందుకు వచ్చానని చెప్తుంది జ్యో. బావ ఇచ్చిన గిఫ్ట్ లను తిరిగి ఇచ్చేస్తున్నా. ఇన్ని రోజులు బావ నన్ను వద్దనుకున్నాడు. ఇప్పుడు నేనే వద్దనుకుంటున్నా. ఫోన్లో బావతో ఉన్న ఫోటోలను కూడా డిలీట్ చేశానని జ్యో చెప్తుంది.

కార్తీక్ తనకు ఇచ్చిన ఒక్కో గిఫ్ట్ గురించి చెప్తూ అన్నింటినీ తీసి టేబుల్ మీద పెడుతుంది జ్యోత్స్న. ఇవన్నీ నువ్వే తీసుకో బావ అని జ్యోత్స్న అంటుంది. మనిషి అన్నాక పెళ్లి చేసుకోవాలని కాంచన, శ్రీధర్ జ్యోత్స్నకు చెప్తారు. శ్రీధర్ కు పెళ్లి విషయంలో జ్యోత్స్న కౌంటర్ వేస్తుంది. ఈ రోజు నుంచి నీకు, నాకు ఏ సంబంధం లేదు బావ. నీకు, నాకు పెళ్లి చేయాలని పెద్...