భారతదేశం, జూలై 22 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 22 ఎపిసోడ్ లో సూరజ్ కుటుంబం గురించి తెలుసుకునేందుకు సుమిత్ర వరుసగా ప్రశ్నలు వేస్తుంది. మరోవైపు కాంచన కుటుంబాన్ని కొనేందుకు మాలిని ఇంటికి వెళ్తుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

తన తల్లి దగ్గర దీపను తెగ పొగిడేస్తాడు కార్తీక్. నా కోడలికి దిష్టి తీయాలి. దీని చేతిలో మాలిని, దక్షిణామూర్తి ఓడిపోయారు కదా. ఎంత తిట్టుకుని ఉంటారో అని కాంచన అంటుంది. అంటే ఓ బస్తెడు మిరపకాయలు కావాలి. ఎదుగుతున్న వాళ్లపై అందరి కళ్లు ఉంటాయని కార్తీక్ అంటాడు. ముఖ్యంగా పారిజాతం కళ్లన్నీ మనమీదే అని కార్తీక్ చెప్తాడు.

తాతకు పారు మీద పీకల దాకా కోపం ఉంది. అందుకే పురిట్లోనే బిడ్డను అని నోరు జారబోయి మళ్లీ కవర్ చేసుకుంటాడు కార్తీక్. పురిట్లో బిడ్డ ఏంటీ అని కాంచన అడిగితే.. జ్యోత్స్నను చిన్నప...