భారతదేశం, జూలై 29 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 29 ఎపిసోడ్ లో మాలినికి దీప దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తుంది. సూరజ్ కూడా గట్టిగానే మాట్లాడతాడు. పారిజాతం గుట్టు బయటపెడతాడు. కానీ మాలిని రూపాయికి రూపాయి ఇచ్చి లెక్క సరిపోయిందని చెప్తుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

జ్యోత్స్నకు పెళ్లి సంబంధం తీసుకురావడమే కాకుండా శివ నారాయణ ఇంటికి నేరుగా వచ్చిన మాలిని మళ్లీ చిచ్చు రేపుతుంది. ఇంట్లో అందరితో మాటల యుద్ధం చేస్తుంది. ఈ క్రమంలోనే దీప వర్సెస్ మాలిని వాగ్వాదం జరుగుతుంది. సుమిత్రమ్మ మా అమ్మ అని దీప షాకిస్తుంది.

సుమిత్ర మీ అమ్మనా అని మాలిని అడుగుతుంది. ఈ ఇంటి ఆడపడుచు కోడలికి ఆవిడ అమ్మ. నేను అమ్మలాగే చూస్తాను. ఆవిడను ఒక్క మాట అన్న ఊరుకోను. ఈ దక్షిణామూర్తి తాత ఏమో కూతురు బతికి ఉండగానే పిండం పెట్టారు. అప్పుడు ఏమైంది బం...