భారతదేశం, సెప్టెంబర్ 21 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో.. శివ నారాయణ కుటుంబాన్ని సర్వ నాశనం చేస్తున్నానని సూరజ్ తో మాలిని చెప్తుంది. మన వ్యాపారాలు నువ్వు చూసుకో. ఇప్పుడు జ్యోత్స్న రెస్టారెంట్స్ కూడా మనవే. అడగడానికి, ఆపడానికి ఎవరూ లేరని మాలిని పొగరుగా చెప్తుంది.

జ్యోత్స్న పెళ్లి ఆపడంతో మనం బదులు తీర్చుకున్నామని చెప్పావ్ కదమ్మా. మరి ఇదంతా ఏంటీ? అని సూరజ్ తల్లిని ప్రశ్నిస్తాడు. అక్కడితో ఆగిపోలేదు. మీ తాతను అవమానించారు. జ్యోత్స్న నీ మీద చేయి ఎత్తింది. తాతయ్యకు అవమానం జరుగుతుంటే నువ్వు చూస్తు ఊరుకుంటావా? నా కొడుకుకు అవమానం జరిగితే నేను చూస్తూ ఊరుకోను. ఇప్పుడు శివ నారాయణ కుటుంబం పొగరు దించానని సూరజ్ ను రెచ్చగొట్టేలా మాలిని మాట్లాడుతుంది.

నేను తప్పు చేశానని నీకు అనిపిస్తుందా? నేను తప్పు చేసినా సరే నువ్వు తల...