భారతదేశం, ఆగస్టు 22 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో దీపకు శివ నారాయణ కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తాడు. దాంట్లో ఏముందో కార్తీక్‌ను చదవమంటాడు. అందులో జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ సీఈఓగా ఎప్పటికీ దీపే కొనసాగుతుందని ఉందని కార్తీక్ అంటాడు.

దాంతో పారిజాతం తెగ షాక్ అయిపోతుంది. ఇది అన్‌లిమిటెడ్, జ్యోత్స్న రెస్టారెంట్స్ ఉన్నంతకాలం ఉంటుంది. దీపే శాశ్వతంగా సీఈఓగా ఉంటుంది. ఒకవేళ దీపను తీసేయాలనుకుంటే రూ. 10 కోట్లు నష్టపరిహారంగా కట్టాలని కార్తీక్ అంటాడు. ఇలా ఎందుకు రాయించావ్ నాన్న అని కాంచన అడుగుతుంది. ఇది నా కోరిక కాదు జ్యోత్స్న కోరిక అని శివ నారాయణ అంటాడు.‌

ఇంతలో జ్యోత్స్న వచ్చి అవును, ఇది నా పెళ్లి కానుక అనుకో అని అంటుంది. కానుక అదిరిపోయిందని శ్రీధర్ అంటాడు. మనిద్దరం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని దీప చేయ...