భారతదేశం, అక్టోబర్ 3 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో తొలిరోజే టిఫిన్ బండికి నష్టాలు వచ్చాయని, ఒక్కరు కూడా కొనలేదని పారిజాతం చెబుతుంది. ఇడ్లీలు వేస్ట్ కాకుండా నీ స్టైల్‌‌లో ఉప్మా చేయి. ఈరోజు అందరం ఉప్మానే తిందాం. అసలే తాతకు ఫుడ్ వేస్ట్ చేయడం నచ్చదని కార్తీక్ అంటాడు.

నువ్వు ఆ మాట అంటే ఫుడ్ వేస్ట్ కాదు నేను వేస్ట్ అన్నట్లుంది. కొంతమంది మన పక్కన ఉంటే మనమీద మనకే నమ్మకం పోతుంది. నేను ఇడ్లీ బండి తీసుకోడానికి కారణమే కార్తీక్. వాడు అక్కడికి రాకుంటే వాడు ఆ మాటలు అనేవాడు కాదు. వాడితో నేను పౌరుషానికి పోయి ఇడ్లీ బండి తీసుకునేవాన్ని కాదు. నా కర్మకు ఇంకెవరినో బాధ్యులను చేయడమెందుకులే. మీకు కావాల్సింది మేము ఇలా ఉండటమేగా అని తాత అంటాడు.

దమ్మిడి సంపాదన లేదు. వేడి నీళ్లు పోసుకుంటే కానీ ఈ నీరసం పోదు. ఏం కర్మ వచ్చిం...