భారతదేశం, జూలై 27 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్న ఎక్కడికి వెళ్లింది అనేది ఇంట్లో శివ నారాయణ పంచాయితీ పెడుతాడు. జ్యోత్స్న ఎక్కడికి వెళ్లిందో అడగడం నాది తప్పంటారా అని సూరజ్ అంటుంటే.. తప్పు లేదని దశరథ ఎంట్రీ ఇస్తాడు.

మన ఆఫీస్‌లో పని చేసేందుకు నిజాయతీ, జవాబుదారీతనం కచ్చితంగా ఉండాల్సిందే అని దశరథ్ అంటాడు. ఇప్పుడు లేవని ఎవరన్నారని పారు అంటే.. చెప్పకుండా వెళ్లిన జ్యోత్స్ననే అని కార్తీక్ అంటాడు. నువ్వు ఆపురా నాయనా.. ఆ తాడుబొంగరం లేనోడి మాటలు పట్టుకుని అని పారిజాతం అంటుంది.

తాడుబొంగరం లేనోడు అంటే అని సూరజ్ అడిగితే.. పెళ్లి పెటాకులు లేనోడని అర్థమని పారు చెబుతుంది. అంటే నన్ను జ్యోత్స్నను కలిపి మా ఇద్దరిని తిడుతున్నట్లే అని సూరజ్ అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. మెడనొప్పి పోయింది గుండెనొప్పి తెప...