భారతదేశం, నవంబర్ 7 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో సూరజ్, దశరథ గొడవ పడుతూనే ఉంటారు. దశరథను జ్యో ఆపుతుంది. సూరజ్‌ను కూడా ఆపేందుకు ట్రై చేస్తుంది. కానీ ఎవ్వరు తగ్గరు. సూరజ్‌ను మతిపోయిందా అని జ్యోత్స్న అంటుంది.

మతిపోయింది నాకు కాదు వీళ్లకి. ఎక్కడి కోపం ఎక్కడ చూపిస్తున్నారు. నా క్యారెక్టర్ గురించి తక్కువ మాట్లాడితే ఊరుకోను అని సూరజ్ అంటాడు. నువ్వు ఏం చేసిన చూస్తూ ఉంటానా అని మళ్లీ మీదకు వెళ్తాడు దశరథ. అంతలో శౌర్య వస్తుంది. ఎందుకు కోప్పడుతున్నారని అడుగుతుంది. లేదు మాట్లాడుకుంటున్నారని చెప్పి శౌర్యతోపాటు అంతా వెళ్తారు.

ఇంటికెళ్తారు. శౌర్యను లోపలికి వెళ్లమంటుంది సుమిత్ర. తర్వాత జ్యోత్స్నను లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది సుమిత్ర. దాంతో అంతా షాక్ అవుతారు. ఎందుకు జ్యోత్స్నును కొట్టావని కార్తీక్ అడుగుతాడు. ఈర...