భారతదేశం, అక్టోబర్ 16 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో మార్చురీ వార్డ్ దగ్గర సూరజ్‌కి జ్యోత్స్న కనిపిస్తుంది. దాంతో సూరజ్ షాక్ అవుతాడు. ఇంతలో ఇద్దరు అడ్డంగా వస్తారు. మళ్లీ జ్యోత్స్న కనిపించదు. మరింత షాకైన సూరజ్ జ్యో కోసం వెతుకుతుంటాడు. జ్యోత్స్న అంటూ గట్టిగా పిలుస్తాడు.

జ్యోత్స్ననే చూశానా. ఇంకెవరిని చూసిన తనలాగే అనిపిస్తుందా. ఏమైంది నాకు. ఆ డెడ్ బాడీ జ్యోత్స్నది కాదు. మరి జ్యోత్స్న ఎక్కడుంది. అర్జంట్‌గా ఈ విషయం కార్తీక్‌కు చెప్పాలని మెసేజ్ చేస్తాడు సూరజ్. అప్పటికే దీప ఏడుస్తుంటుంది. సూరజ్ మెసేజ్ చెప్పి జ్యోత్స్న డెడ్ బాడీ కాదు అని కార్తీక్ అంటాడు. నాకు తెలుసు బావ. జ్యోత్స్న కాదు. జ్యోత్స్న క్షేమంగా ఉంటుందంటూ ఏడుస్తుంది దీప.

ఆ మాటలు సుమిత్ర వింటుంది. నా కూతురుకి ఏమైందని నిలదీస్తుంది. మా అమ్మ మీద ...