భారతదేశం, అక్టోబర్ 12 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ఇడ్లీ బండి వ్యాపారంలో వచ్చిన డబ్బులను లెక్కపెడుతూ శివ నారాయణ మురిసిపోతాడు. డబ్బుకు మించిన పేరు సాధించా. అదే శాశ్వతం అనుకున్నా. కానీ డబ్బే శాశ్వతం అని శివ నారాయణ అంటాడు.

నా చేతిలో ఈ డబ్బు ఉండటానికి కారణం నువ్వే కార్తీక్. అందుకు థ్యాంక్స్ అని శివ నారాయణ చెప్తాడు. నువ్వు వాడి తాతవి కాబట్టి నీకు సహాయం చేయడం వాడి బాధ్యత అని కాంచన అంటుంది. కార్తీక్ అందరికీ సహాయం చేస్తాడు. అలా చేసే ఈ శివ నారాయణను చిల్లర లెక్కపెట్టుకునే శివ నారాయణగా మార్చాడని శివ నారాయణ కౌంటర్ వేస్తాడు.

దశరథ, సుమిత్ర కూడా కార్తీక్ ను టార్గెట్ చేసి మాట్లాడతారు. ఇక జ్యోత్స్న రాలేదని సుమిత్ర కంగారు పడుతుంది. 24 గంటలు దాటినా జ్యోత్స్న రాలేదు. ఫోన్ లేదు, మెసేజ్ లేదు. మాకు ఏడవడం తప్పా...