భారతదేశం, నవంబర్ 24 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. బుల్లెట్ తగిలి చావు బతుకుల్లో ఉన్న సూరజ్ కోసం బ్లడ్ ఇచ్చేందుకు ఒక వ్యక్తి హాస్పిటల్ కు వస్తాడు. కానీ తనది రేర్ బ్లడ్ గ్రూప్ అని, రేటు ఓకే అనుకుంటూనే బ్లడ్ ఇస్తానని ఆ వ్యక్తి షాక్ ఇస్తాడు. రూ.25 లక్షలు ఇస్తేనే బ్లడ్ ఇస్తానని ఆ పర్సన్ డిమాండ్ చేస్తాడు.

గతంలో దీప ప్రాణాల కోసం హాస్పిటల్లో పోరాడుతున్న సమయంలో కార్తీక్ తో పేపర్లపై సంతకం పెట్టించుకున్న విషయాన్ని జ్యోత్స్న గుర్తు చేసుకుంటుంది. కార్తీక్, దీప ఎంత చెప్పినా కూడా ఆ వ్యక్తి బ్లడ్ ఇవ్వడానికి డబ్బు ఇవ్వాల్సిందేనంటాడు. అతని మాటలు జ్యోత్స్నకు ఇండైరెక్ట్ గా తగులుతాయి. డబ్బు ఇస్తేనే రక్తం ఇస్తాను, లేదంటే వెళ్లిపోతానని ఆ వ్యక్తి చెప్తాడు.

డబ్బు ఇస్తానని జ్యోత్స్న అంటుంది. మాలిని అత్త తన అకౌంట్ల...