భారతదేశం, సెప్టెంబర్ 10 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో.. కాంచన ఇంటికి వచ్చిన దక్షిణామూర్తి కార్తీక్ తో రాజీ గురించి మాట్లాడతాడు. సూరజ్, జ్యోత్స్న పెళ్లకి ఒప్పుకొంటాను కానీ శివ నారాయణ తన కాళ్లు పట్టుకోవాలంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శివ నారాయణ కోపంతో ఊగిపోతాడు.

ఎవరి కోసమైతే వచ్చానో ఆ మనిషినే దేవుడు నా దగ్గరకు పంపించాడు. నువ్వు మీ తాతతో నేను చెప్పిన దాని గురించి మాట్లాడి ఒప్పించు. బయట వెయిట్ చేస్తానని కార్తీక్ కు చెప్పి దక్షిణామూర్తి వెళ్తాడు. ఆరోగ్యం ఎలా ఉందని సుమిత్రను అడుగుతాడు. పరిచయం లేనివాళ్లతో మాట్లాడనని సుమిత్ర తెగేసి చెప్తుంది.

మరోవైపు బంధువులు, కావాల్సినవాళ్లు, స్నేహితులు మీ ఇంటికి వస్తారని కార్తీక్, దీపపై శివ నారాయణ సెటైర్లు వేస్తాడు. మీరు కూర్చొబెట్టి కాఫీలు ఇస్తారు. మధ్యవర్తులుగా కూడా ఉ...