భారతదేశం, అక్టోబర్ 5 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. సూరజ్ పీఏ పోస్టు కోసం జ్యోత్స్నకు తాత దక్షిణామూర్తి సపోర్ట్ గా నిలుస్తాడు. కేఫ్ లో జ్యోత్స్న జాబ్ ఎందుకు తీయించావని దక్షిణామూర్తి అడగడంతో మాలిని షాక్ అవుతుంది.

జ్యోత్స్న కేఫ్ లో పని చేయడం తనకు ఇష్టం లేదని మాలిని మాట మారుస్తుంది. అది నువ్వు చేసిన మంచి పనే. దానికి నిన్ను మెచ్చుకుంటా. మరి పీఏ పోస్టుకు ఎందుకు రిజెక్ట్ చేశారని దక్షిణామూర్తి అడుగుతాడు. నాకు అంతా తెలుసు. జ్యోత్స్న నన్ను కలిసిందని దక్షిణామూర్తి ట్విస్ట్ ఇస్తాడు. మాలిని వల్ల తన జాబ్ పోయిన విషయం, పీఏగా రిజెక్ట్ అయిన విషయం జ్యోత్స్న చెప్పిన విషయాన్ని దక్షిణామూర్తి చెప్తాడు.

నేను రిజెక్ట్ చేయడానికి కారణం శివ నారాయణ. పీఏగా పెట్టుకొంటే వచ్చి గొడవ చేస్తాడని ఏదో కవర్ చేసేందుకు మాలిని ట్ర...