భారతదేశం, నవంబర్ 5 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. కాంచన ఇంటికి వచ్చిన మాలిని శ్రీధర్ ను అవమానించేలా మాట్లాడుతూ మరో పెంట పెడుతుంది. అసలు మీకు సిగ్గుందా? రెండు పూటల భోజనం ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదని మాలిని అంటుంది.

ఏం చెప్పాలనుకుంటున్నావ్ మాలిని అని శ్రీధర్ అడుగుతాడు. నీకేం తక్కువా? కార్తీక్ నీ కన్నకొడుకా? లేదా ఏ బస్టాండ్ లో అయినా దొరికాడా? కన్న కొడుకే అయి ఉంటే ఇంకొకరి కాళ్ల దగ్గర పని చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? నువ్వొక అసమర్థపు తండ్రివి అని మాలిని అంటుంది.

పిన్ని నువ్వు ముందు లే, బయటకు వెళ్లు అని కార్తీక్ ఫైర్ అవుతాడు. అనవసరంగా వేరేవాళ్లతో మాటలు పడాల్సిన అవసరం లేదని కార్తీక్ ఫుల్ సీరియస్ అవుతాడు. కార్తీక్ నువ్వు ఇక్కడే ఉండు, కానీ మాట్లాడితే నా మీద ఒట్టే అని శ్రీధర్ షాక్ ఇస్తాడు. మాల...