భారతదేశం, సెప్టెంబర్ 1 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. సూరజ్ చేతిలో మోసపోయామని కార్తీక్, దీప ఫీల్ అవుతుంటారు. మనకు ఈ గతి పట్టించిన మాలిని బాగుంది. మనవడిని పంపిన దక్షిణామూర్తి బాగానే ఉన్నాడు. మోసం చేసిన సూరజ్ బాగానే ఉన్నాడు. మనం ఎటూ కాకుండా మిగిలిపోయామని దీపతో కార్తీక్ అంటాడు.

సూరజ్ అన్ని తెలుసుకొని పక్కా ప్లాన్ తో ఈ గేమ్ ఆడాడు. బ్యాంకులో రాబరీ చేసిన వాళ్లలాగే సూరజ్ ప్లాన్ చేశాడు. సూరజ్ గ్రౌండ్ వర్క్ చేశాడు. మన ద్వారా ఇంట్లోకి వచ్చాడు. డబ్బులు తీసుకోకుండా ఎవరైనా జాబ్ చేస్తారా? కానీ సూరజ్ చేశాడు. మా నాన్న ఎప్పుడో చెప్పాడు. సూరజ్ విషయంలో ఎప్పటికప్పుడు మోసపోతూ వచ్చామని దీపతో కార్తీక్ చెప్తాడు.

చివర్లో మనల్ని దోషులుగా చేయడం కూడా ఆటలో భాగమే. పెళ్లి ఆగిపోతే ఎవరో ఒకరు గుండె పట్టుకొని పడిపోతారని సూర...