భారతదేశం, మార్చి 10 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో హాస్పిటల్‌కు వెళ్లిన కార్తీక్‌తో గైనకాలజిస్ట్ వచ్చారు, దీపకు టెస్ట్‌లు చేయాలట, మీ నాన్న, పాప వచ్చారు అని నర్స్ చెబుతుంది. శౌర్యను నాన్న ఎందుకు తీసుకొచ్చాడు అని లోపలికి వెళ్తాడు కార్తీక్.

అమ్మ కావాలని శౌర్య ఏడుస్తుంటే నీకు కాల్ చేశాను. నువ్వు లిఫ్ట్ చేయకపోయేసరికి తీసుకొచ్చానని శ్రీధర్ అంటాడు. నాన్నా అబద్ధం ఎందుకు చెప్పావ్ అని శౌర్య అడుగుతుంది. నిజమే చెప్పాను, అమ్మను చూసుకునేందుకే ఇక్కడ ఉంచారని కార్తీక్ అంటాడు. అమ్మా నీకు జ్వరం వచ్చిందా. లోపల ఉన్న బేబీకి కూడా జ్వరం వస్తుందా, తను ఏం వేసుకుంటుంది అని మాట్లాడిన శౌర్య బేబీ బొమ్మ ఇస్తుంది.

ఇంతలో గైనకాలజిస్ట్‌తో డాక్టర్ హారిక వస్తుంది. టెస్టులు చేయాలని హారిక అంటే.. మీరు ఎన్ని టెస్టులైన చేయండి...