భారతదేశం, మార్చి 27 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 27 ఎపిసోడ్ లో.. వీలునామాను మార్చి రాయాలని జ్యోత్స్న పట్టుబడుతుంది. నువ్వు నా కూతురివి కాదని చెప్పు, ఇప్పుడే వీలునామా మారుస్తానని దశరథ అంటాడు. మేనల్లుడి కుటుంబానికి చెందాలని ఎలా రాస్తావ్? అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. కాంచన కుటుంబాన్ని పారిజాతం నిందిస్తుంది.

నా భార్య కానీ కొడుకు కానీ ఆస్తుల కోసం ఆరాటపడేవాళ్లే అయితే ఈ పంచాయతీ ఇంట్లో కాదు ఎనాడో కోర్టులో జరిగేది. కాగితాలు తీసుకొని మరీ బతిమిలాడా. కానీ శివనారాయణ మీద కేసు వేసేందుకు నా భార్య కానీ కొడుకు కానీ ఒప్పుకోలేదు. ఇలాంటి మనుషుల మీదా మీరు నిందలు వేసేదని శ్రీధర్ ఫైర్ అవుతాడు.

మామయ్య నువ్వన్నదే నిజం అయితే మేనల్లుడి కుటుంబానికి ఆస్తి అనే క్లాజ్ ను అత్తయ్య ప్రశ్నించేదే అని జ్యోత్స్న అంటుంది. మామకు వెన్నుపోటు పొడిచావని శ్రీధర్ ను ఉద్దేశ...