భారతదేశం, మే 6 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో అగ్రిమెంట్ కు, పెళ్లికి లింక్ పెట్టిన జ్యోత్స్న ట్విస్ట్ ఇస్తుంది. కార్తీక్ ను తన ఇంట్లోనే ఉంచుకోవాలని అనుకుంటుంది. శ్రీధర్ తప్పుకోవడంతో సీఈఓ పోస్టు ఖాళీ అవుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 6 ఎపిసోడ్ లో చూద్దాం.

నేను మాట తప్పను కాబట్టి తన పెళ్లి అయ్యేంతవరకూ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయనని జ్యోత్స్న చెప్తుంది. అంటే జ్యో పెళ్లికి ఒప్పుకున్నట్లే. ఇప్పుడు రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటేమో సీఈఓ, మరొకటి జ్యో పెళ్లి అని దీపతో కార్తీక్ అంటాడు. జ్యో మనసు దుర్మార్గమైంది. అనుకున్నది చేయడానికి ఏమైనా చేస్తుందని దీప అంటుంది.

మరోవైపు కాంచన, శ్రీధర్ వాదులాడుకుంటారు. జ్యోత్స్న చేసింది, చేస్తుంది 100 పర్సెంట్ కరెక్ట్ అని శ్రీధర్ అంటాడు. తప్పు కార్తీక్ దే. జరిగ...