భారతదేశం, సెప్టెంబర్ 4 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో.. మా కుటుంబం ఎంత బాధపడిందో, మీ కుటుంబం కూడా అంతే బాధపడాలని జ్యోత్స్నతో సూరజ్ చెప్తాడు. పగ తీర్చుకోవడం కోసమే నాతో ప్రేమ నటించావా? అని జ్యోత్స్న అడుగుతుంది.

నేను ఏదైనా నా తల్లి కోసమే చేశానని సూరజ్ చెప్తాడు. నన్ను ప్రేమించలేదని కళ్లలోకి చూసి చెప్పు అని జ్యోత్స్న అడుగుతుంది. కానీ సూరజ్ మాత్రం పక్కకు చూసి మాట్లాడతాడు. ఇప్పుడు నీ మనసులో నా మీద ప్రేమ లేదా? మా అమ్మ మీద పగతో నువ్వు ఇలా చేశావంటే నమ్ముతా. కానీ ప్రేమ కూడా అబద్ధం అంటే నమ్మనని జ్యోత్స్న అంటుంది.

మా అమ్మ శత్రువులు నాకూ శత్రువులే అని మండపంలో చెప్పావ్ కదా. నాది కూడా అదే మాట అని సూరజ్ అంటాడు. నన్ను మార్చావ్. నువ్వు లేకపోతే నాకు జీవితం లేదన్నంతగా మార్చావ్. ఇప్పుడు పగ, ప్రతీకారం కోసం ప్రేమ, పెళ్లిని...