భారతదేశం, మార్చి 15 -- కార్తీక దీపం 2 సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో దీప, కార్తీక్ విషయాన్ని జ్యోత్స్న బట్టబయలు చేస్తుంది. జ్యోత్స్న దెబ్బతో శివ నారాయణ కుటుంబం అంతా అల్లకల్లోలం అవుతుంది. దీప అంతా తనపై నింద వేసుకుంటుంది. అన్న దశరథ కూడా మోసం చేశాడని కాంచన బాధపడుతుంది.

తాను పుట్టింట్లో నట్టింట్లో చచ్చిపోయినట్లే అని వెళ్లిపోతుంది. శివ నారాయణ కూలబడిపోతాడు. పారిజాతం, జ్యోత్స్న సంతోషిస్తారు. దీప గురించి కార్తీక్, దశరథ్ మాట్లాడుకుంటారు. జ్యోత్స్నకు అనుమానం వచ్చిందని, చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారు. అప్పుడు జ్యోత్స్న వారిని చూస్తుంది. కానీ, వారి మాటలు వినిపించవు.

దీప గురించే మాట్లాడుకుంటున్నారని జ్యోత్స్న అనుకుంటుంది. జ్యోత్స్నను చూసి కార్తీక్, దశరథ్ మాట్లాడుకోవడం ఆపుతారు. దాంతో జ్యో వెళ్లిపోతుంది. తల్లిని చూడాలని దీప పట్టుబట్టడంతో కార...