భారతదేశం, మే 1 -- Karthika Deepam 2: రసవత్తరంగా సాగుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చేందుకు కొత్త క్యారెక్టర్ లో ఓ నటుడు వచ్చేశాడు. బ్రహ్మముడి సీరియల్ లో రాహుల్ గా ఆడియన్స్ ను ఎంటర్ టైన చేస్తున్న శ్రీకర్ కృష్ణ‌ ఇప్పుడు కార్తీక దీపం 2 సీరియల్ లోకి కూడా వచ్చేశాడు. వస్తూనే ఫైర్ బ్రాండ్ జ్యోత్స్నపైనే ఫైర్ అయ్యాడు.

తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూ, రేటింగ్ లో టాప్ లో దూసుకెళ్తోంది కార్తీక దీపం 2 సీరియల్. ప్రస్తుతం ఈ సీరియల్ జ్యోత్స్న పెళ్లి చుట్టూ కథ సాగుతోంది. జ్యోకు నెల రోజుల్లో పెళ్లి చేస్తామని కార్తీక్, దీప ఛాలెంజ్ చేశారు. ఈ నేపథ్యంలో కొత్త హీరో ఎంట్రీ ఆసక్తికరంగా మారింది.

జ్యోత్స్న కోసం పెళ్లి కొడుకును వెతికే పనిలోనే కార్తీక్ ఉండగా.. సీరియల్ లో శ్రీకర్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో జ్యోకు కాబోయే మొ...