భారతదేశం, జూలై 7 -- Karthika Deepam 2: స్టార్ మా (Star Maa) ఛానల్‌లో అత్యధిక టీఆర్‌పీ రేటింగ్‌తో దూసుకుపోతున్న టాప్ సీరియల్ 'కార్తీకదీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్‌ కథ ప్రస్తుతం అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిరిగింది. దీనికి ప్రధాన కారణం.. కథలోకి సరికొత్త విలన్‌గా 'మాలిని' పాత్ర ప్రవేశించడం. ఆ మాలిని క్యారెక్టర్ చేస్తున్న తేజస్విని ప్రకాష్ గురించి తెలిస్తే షాక్ అవాల్సిందే.

అమితమైన డబ్బు, పొగరు, అహంకారం కలిగిన ఒక రిచ్ బిజినెస్‌వుమన్‌గా కార్తీక దీపం 2 సీరియల్ లోకి మాలిని అడుగుపెట్టింది. ఈ పాత్రలో కన్నడ నటి తేజస్విని ప్రకాష్ నడింపల్లి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. హోటల్‌ను దక్కించుకోవడమే లక్ష్యంగా సాగే ఈమె పాత్ర సీరియల్‌లో సరికొత్త డ్రామాను రేపుతోంది.

తేజస్విని ప్రకాష్ కేవలం గ్లామర్ కోసమే కాకుండా, నటనలోనే పుట్టి పెరిగిన కుటుంబం నుండి వచ్చి...