భారతదేశం, ఆగస్టు 8 -- Karthika Deepam 2: బుల్లితెరపై ట్రెండ్ క్రియేట్ చేస్తున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. అప్పట్లో కార్తీక దీపం సీరియల్ టీవీ రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వస్తున్న 'కార్తీక దీపం 2' కూడా అదరగొడుతోంది. ప్రస్తుతం టీవీలో మోస్ట్ ట్రెండింగ్ సీరియల్ గా కార్తీక దీపం 2 కొనసాగుతోంది. ఈ సీరియల్ లో వస్తున్న ట్విస్ట్ లు ఆడియన్స్ ను అలరిస్తున్నాయి.

కార్తీక దీపం 2 సీరియల్ లో ప్రస్తుతం కొత్త క్యారెక్టర్లు చూపిస్తున్న ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సూరజ్ క్యారెక్టర్ లో వేరియేషన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. అసలు ఈ సూరజ్ ఎవరు అనే మిస్టరీని మేకర్స్ పక్కాగా కొనసాగించడంలో సక్సెస్ అవుతున్నారు. సూరజ్ క్యారెక్టర్ లోని షేడ్స్ తో సీరియల్ క్రేజ్ ఇంకా పెరుగుతోంది.

కార్తీక దీపం 2 సీరియల్ విలన్ ఎవరంటే అందరూ జ్యోత్స్న అని చెప్తార...