భారతదేశం, సెప్టెంబర్ 1 -- Karthika Deepam 2: స్టార్ మాలో వస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ అంటే విపరీతమైన అభిమానం ఉన్న తెలుగు రాష్ట్రాల జనాలు ఎక్కువే. రాత్రి అయిందంటే తాజా ఎపిసోడ్ కోసం టీవీ ముందు కూర్చుని వెయిట్ చూస్తుంటారు. కార్తీక దీపం 2 సీరియల్ జనాల్లోకి బాగా వెళ్లిపోయింది. అయితే ఇప్పుడీ సీరియల్ మేకర్స్ మరో ప్లాన్ వేశారనిపిస్తోంది.

కార్తీక దీపం 2 సీరియల్ ను మరో 500 ఎపిసోడ్లు ఈజీగా లాగేలా మేకర్స్ మాస్టర్ ప్లాన్ వేశారనే టాక్ వినిపిస్తోంది. దీప ప్లేస్ లో శివ నారాయణ వారసురాలిగా జ్యోత్స్న జీవితం కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా చేసి దీపను తన అమ్మానాన్నకు దగ్గర చేయాలని కార్తీక్ ప్రయత్నిస్తుంటాడు. దీపే అసలు వారసురాలు అని తెలియడమే అసలు కథ.

దీపనే నిజమైన వారసురాలని కార్తీక్, జ్యోత్స్న, పారిజాతం, దశరథ, దాసుకు మాత్రమే తెలుసు. మిగతా వాళ...