భారతదేశం, జూలై 17 -- ప్రేమ పేరిట వేధిస్తున్న ఓ ఉన్మాది రెచ్చిపోయాడు! రద్దీగా ఉండే బస్టాండ్‌లో అందరూ చూస్తుండగానే ఓ యువతిపై కత్తితో విరుచుకుపడ్డాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆమె పరుగులు తీసినా వదలకుండా వెంటాడి, వేటాడి మెడపై నరికి దారుణంగా హత్య చేశాడు. గురువారం సాయంత్రం కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్ పరిధిలోని బీసీ రోడ్ కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండ్‌లో జరిగిన ఈ ఘటన సర్వత్రా కలకలం సృష్టిస్తోంది.

మృతురాలిని దక్షిణ కన్నడ జిల్లా కాక్యాపడవు సమీపంలోని కొడంగే నివాసి లావణ్య (21)గా పోలీసులు గుర్తించారు. లావణ్య కల్లాడ్కలోని ఒక ప్రైవేట్ క్లినిక్‌లో నర్సుగా పనిచేస్తోంది. గురువారం సాయంత్రం డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. బెల్తంగడికి చెందిన చేతన్ (22) అనే యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. అతడు మృతురాలికి దూరపు బంధువు అని ప...