భారతదేశం, మే 30 -- కర్ణాటక రాజకీయాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. శనివారం విధాన సౌధలో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) సమావేశంలో శివకుమార్‌ను సీఎల్‌పీ నేతగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సిద్ధరామయ్య స్వయంగా డీకే శివకుమార్ పేరును ప్రతిపాదించగా.. మరో సీనియర్ నేత జి. పరమేశ్వర దీనిని బలపరిచారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యదర్శులు కె.సి. వేణుగోపాల్, రణదీప్ సింగ్ సుర్జేవాలాల సమక్షంలో ఈ ఎంపిక ప్రక్రియ ముగిసింది.

సమావేశం ప్రారంభంలోనే నూతన నాయకుడి ఎన్నిక ప్రక్రియ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపాదనతోనే మొదలవుతుందని ఏఐసీసీ ప్రతినిధి సుర్జేవాలా ప్రకటించారు. మొదట సిద్ధరామయ్య ...