భారతదేశం, మార్చి 21 -- బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తున్న 'ధురంధర్ 2: ది రివెంజ్' చిత్రానికి అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుతున్నాయి. ఇప్పటికే రాజమౌళి, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి దిగ్గజాలు ఈ సినిమాను కొనియాడగా, తాజాగా బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ ఈ చిత్రంపై తనదైన శైలిలో స్పందించారు. శనివారం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక సుదీర్ఘ సందేశాన్ని పంచుకుంటూ, దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతిభను ఆకాశానికెత్తారు.

కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చారు. "'ధురంధర్' విజయంలో గొప్ప విషయం ఏమిటంటే, ఒక సూపర్ స్టార్ డైరెక్టర్‌గా ఆదిత్య ధర్ స్థిరపడ్డారు.

హాలీవుడ్‌లో స్పీల్ బర్గ్, టరాన్టినో, నోలన్ వంటి దర్శకులు అక్కడి సూపర్ స్టార్ నటుల కంటే చాలా గొప్పవారు. కానీ మన దేశంలో ఫిల్మ్ మేకర్స్ కు తగినంత గౌరవం లేదా గుర్తింపు ఇవ్వడం లేదు. అందుకే ఎవర...