భారతదేశం, జూన్ 8 -- Kangana Ranaut: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతున్నా, సోషల్ మీడియాలో మాత్రం తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ముఖ్యంగా సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' క్యారెక్టర్‌ను ప్రెజెంట్ చేసిన విధానంపై ఆడియన్స్ నుంచి విపరీతమైన విమర్శలు వస్తున్నాయి.

కేవలం గ్లామర్ కోసమే ఫీమేల్ క్యారెక్టర్లను వాడుకోవడం, హీరోయిన్ ఇష్టానికి వ్యతిరేకంగా రొమాంటిక్ సీన్స్ పెట్టడంపై ఇప్పుడు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా రియాక్ట్ అయ్యారు.

'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ అందాన్ని హైలైట్ చేసే క్రమంలో కెమెరా యాంగిల్స్ కాస్త అభ్యంతరకరంగా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి తోడు హీరో రామ్ చరణ్ క్యారెక్టర్ పదే పదే అ...