భారతదేశం, జూన్ 29 -- Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, పాపులర్ స్టాండప్ కమెడియన్ కమ్ యాక్టర్ వీర్ దాస్ కాంబినేషన్‌లో వచ్చిన 'రివాల్వర్ రాణి' సినిమా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో కంగనాతో చేసిన ఒక బోల్డ్ కిస్సింగ్ సీన్ వల్ల వీర్ దాస్ పెదవి తెగి తీవ్రంగా గాయపడ్డాడంటూ ఒక జర్నలిస్ట్ చేసిన కామెంట్స్ నెట్టింట తీవ్ర దుమారం రేపాయి. ఈ రూమర్స్ పై హీరో వీర్ దాస్ తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అసలు నిజం ఏంటో తేల్చేశాడు.

ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో సీనియర్ జర్నలిస్ట్ సిమి చందోక్ మాట్లాడుతూ.. రివాల్వర్ రాణి షూటింగ్ టైంలో కిస్సింగ్ సీన్ ముగిసినా కంగనా ఆగలేదని, వీర్ దాస్ పెదవి గట్టిగా కొరకడంతో రక్తం వచ్చిందని కామెంట్స్ చేసింది.

ఈ రూమర్ కాస్తా విపరీతంగా ట్రోల్ అవ్వడంతో ఒక నెటిజన్ ఎక్స్ వేదికగా వీర్ దాస్‌ను...