భారతదేశం, ఏప్రిల్ 16 -- Kangana Ranaut: బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ల మధ్య ఏదో నడుస్తోందంటూ వస్తున్న రూమర్లకు కంగనా తనదైన శైలిలో ఫుల్‌స్టాప్ పెట్టారు. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని, అంతకు మించి ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు. ఒకవేళ అదే నిజమై ఉంటే ఇప్పటికే తమకు పిల్లలు పుట్టేవాళ్లని చెప్పారు.

2024లో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కంగనా రనౌత్, చిరాగ్ పాశ్వాన్ ఒకరినొకరు పలకరించుకోవడం, నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. 'మిలే నా మిలే హమ్' (2011) చిత్రంలో కలిసి నటించిన ఈ మాజీ సహనటులు, ఇప్పుడు రాజకీయాల్లో కూడా పక్కపక్కనే కనిపిస్తుండటంతో వీరి మధ్య 'రోమాన్స్' మొదలైందంటూ సోషల్ మీడియాలో మీమ్స్, పోస్ట్‌లు వెల్లువెత్తాయి. తాజాగా ఏఎన్ఐ (ANI)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా ఈ అంశంపై కుండబద్ధలు కొట్ట...