భారతదేశం, అక్టోబర్ 8 -- Kamal Haasan Letter To CEC Over Vote Chori Protest: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీరుపై ప్రతిపక్ష 'ఇండియా' కూటమి యుద్ధం ప్రకటించింది. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, 'ఓటు చోరీ'కి పాల్పడుతున్నారంటూ ప్రతిపక్ష ఎంపీలు దిల్లీలోని అశోకా రోడ్డులో భారీ ధర్నా నిర్వహించారు.

ఓటర్ల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్రిక్తతల నడుమ మక్కల్ నీది మయ్యమ్ అధినేత, ఎంపీ, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు ఆసక్తికర లేఖ రాశారు.

రాజ్యాంగబద్ధ సంస్థలపై ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతోందని, పార్లమెంట్‌లోని సంవిధాన్ భవన్‌లో ప్రతిపక్ష ఎంపీలతో సీఈసీ సమా...