భారతదేశం, మార్చి 21 -- దళపతి విజయ్ రాజకీయాల్లోకి రావడం, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడంపై నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్ హాసన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. శుక్రవారం (మార్చి 20) మీడియాతో మాట్లాడిన ఆయన.. తన సినిమా, అలాగే రాజకీయ ప్రయాణం గురించి పలు విషయాలు పంచుకున్నారు. తమిళనాడులో డీఎంకేతో పొత్తు గురించి చర్చలు జరుగుతున్న సమయంలో.. తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు కమల్ ఇచ్చిన సమాధానంపై విమర్శలు వస్తున్నాయి.

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పెరంబూర్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందట కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని ఒక రిపోర్టర్ కమల్‌ను అడగ్గా.. ఆయన నవ్వుతూ.. "నాకెందుకు ఆ విషయం? నాకు బోలెడు పనులున్నాయి, వాటి మీద నేను ఫోకస్ చేయాలి" అని బదులిచ్చారు.

అలాగే తన సినిమాల గురించి చెబుతూ.. "ఎన్నికల తర్వాతే షూటింగ్ ...