భారతదేశం, మే 15 -- Kamal Haasan: ప్రస్తుత పశ్చిమాసియా (West Asia) ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న వేళ, భారతీయ సినీ పరిశ్రమకు 'లోకనాయకుడు' కమల్ హాసన్ ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. నటుడిగానే కాకుండా రాజ్యసభ సభ్యునిగా కూడా ఆయన బాధ్యతాయుతమైన ప్రకటన చేస్తూ, సినిమా నిర్మాణ వ్యయాలను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన విజ్ఞప్తిని గుర్తు చేస్తూ.. ఇంధన ధరలు, రవాణా ఖర్చులు పెరుగుతున్నాయని కమల్ పేర్కొన్నారు. దీనివల్ల సినీ పరిశ్రమపై అదనపు భారం పడుతుందని, ఇది కేవలం నిర్మాణానికే కాకుండా ప్రేక్షకుల ఖర్చు చేసే విధానంపై కూడా ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

కార్మికుల పొట్ట కొట్టొద్దు: బడ్జెట్ తగ్గింపు పేరుతో దినసరి కూలీలు, టెక్నీషియన్ల వేతనాలను తగ్గించకూడదని ఆయన స్పష్టం ...