భారతదేశం, జూలై 30 -- Kamal Haasan: తమిళ నటుడు కమల్ హాసన్ హాలీవుడ్ జీనియస్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన విజువల్ వండర్ 'ది ఒడిస్సీ' (The Odyssey) చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 6,000 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతున్న ఈ హాలీవుడ్ ఎపిక్ డ్రామాను చూసిన కమల్.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ఆసక్తికరమైన అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. భారతీయ సెన్సార్ బోర్డు (CBFC) నుంచి ఈ ప్రత్యేక కానుకకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఆయన ప్రకటించడం ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ప్రపంచ ప్రసిద్ధ గ్రీకు కవి హోమర్ రాసిన చారిత్రక కావ్యం ఆధారంగా తెరకెక్కిన 'ది ఒడిస్సీ' చిత్రంలో మ్యాట్ డామన్, యాన్ హాత్వే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను చూసిన కమల్ హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాస్తూ.. "హోమర్ కలలు కన్నారు....