భారతదేశం, ఏప్రిల్ 17 -- Kalyani Priyadarshan: మలయాళ స్టార్ కిడ్స్ కల్యాణి ప్రియదర్శన్, ప్రణవ్ మోహన్ లాల్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలకు నటి లిజి లక్ష్మి చెక్ పెట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అవన్నీ వట్టి పుకార్లేనని ఆమె స్పష్టం చేశారు.

మలయాళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటుల వారసులుగా అడుగుపెట్టిన కల్యాణి ప్రియదర్శన్, ప్రణవ్ మోహన్ లాల్‌లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. వీరిద్దరూ కలిసి నటించిన 'హృదయం' (2022), 'వర్షాంగళక్కు శేషం' (2024) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా, వెండితెరపై వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయ్యారు.

అప్పటి నుండి ఈ 'రీల్ లైఫ్' జోడీ 'రియల్ లైఫ్'లో కూడా ఒకటి కాబోతోందంటూ నెట్టింట ప్రచారం సాగుతోంది. తాజాగా మలయాళ నూతన సంవత్సరం 'విషు' సందర్భంగా ఈ పుకార్లు మ...