భారతదేశం, ఫిబ్రవరి 27 -- రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్ లో వీళ్ల పెళ్లి గ్రాండ్ గా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో రష్మిక, విజయ్ ఏడు అడుగులు నడిచారు. ఈ విరోష్ వెడ్డింగ్ కు అటెండ్ అయిన వాళ్లలో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ కూడా ఉంది. ఈ పెళ్లి గురించి ఆమె హత్తుకునే పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేసింది.

రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోలను కళ్యాణి ప్రియదర్శన్ తన స్టోరీస్‌లో షేర్ చేసింది. క్యాప్షన్ లో.. "ఈరోజు నేను అత్యంత అందమైన ప్రదేశంలో తన బెస్ట్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్న అమ్మాయిని చూశా. అతను వెనకాలకు తిరిగి కూర్చున్నప్పుడు ఆమె అతని వైపు నడిచింది. అప్పుడు ఆమె వేసిన ఒక్కో అడుగు బరువును మీరూ ఫీల్ కావచ్చు. ఆ నెమ్మదిగా పడిన అడుగులు, ...