భారతదేశం, సెప్టెంబర్ 25 -- Kalyanam Kamaneeyam Jeevitham Review And Rating In Telugu: ప్రేమ, పెళ్లి, అనుమానం, ప్రతీకారం అనే అంశాలు వెండితెరకు కొత్తేమీ కావు. అయితే, నేటితరం జెన్‌జీ యువత ఆలోచనలకు పాతకాలపు భావోద్వేగాలను, ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ కోణాన్ని జోడించి చెప్పిన సినిమానే 'కళ్యాణం కమనీయం జీవితం'.

రవి లోకిరెడ్డి దర్శకత్వంలో ఖాన్ దుర్రానీ, సాహితి అవంచ జంటగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని వీవీఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పైలా ప్రసాదరావు, కిషోర్ గుండాల నిర్మించారు. రాజవంశీ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన ఈ లవ్ థ్రిల్లర్ ఇవాళ (సెప్టెంబర్ 25) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి కళ్యాణం కమనీయం జీవితం రివ్యూలో తెలుసుకుందాం.

హీరోయిన్ సునయన ఒక ఆధునిక జెన్‌జీ యువతి. తన జీవితంలో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఎవరిని ఎంచుకోవాలనే పెద్ద...