భారతదేశం, ఏప్రిల్ 24 -- Kalvakuntla Kavitha New Party : తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై మరో పార్టీకి బీజం పడనుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, జాగృతి వ్యవస్థాపకురాలైన కవిత ఆధ్వర్యంలో ఈ కొత్త పార్టీ ఏర్పాటు కానుంది. చాలా కాలంగానే ఆ దిశగా కసరత్తు చేస్తుండగా. ఈనెల 25వ తేదీన కవిత అధికారికంగా ప్రకటన చేయనున్నారు.

మేడ్చల్‌ జిల్లాలోని మునిరాబాద్‌లో అధ్వయ కన్వెన్షన్‌ వేదికగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు శనివారం ఉదయం పది గంటలకు ముహూర్తం నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావ సభకు జాగృతి శ్రేణులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కవిత మద్దతుదారులు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు. జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఉద్యమకారులను పెద్ద సంఖ్యలోఈ సభకు ఆహ్వానించారని తెలుస్తోంది.

కవిత కొత్త పార్టీ పేరుపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ఓ దశగా ట...