భారతదేశం, సెప్టెంబర్ 30 -- ఆధ్యాత్మిక గురువు, ఒన్ నెస్('ఏకం') సంస్థ వ్యవస్థాపకుడు కల్కి భగవాన్ (77) ఇకలేరు. గత కొంతకాలంగా వయోసహజ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.

చెన్నైలో కన్నుమూసిన కల్కి భగవాన్ భౌతికకాయాన్ని తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం బట్టలవల్లెంలోని 'ఏకం క్షేత్రం' ఆశ్రమానికి కల్కి ట్రస్ట్ ప్రతినిధులు తరలించారు. ఆధ్యాత్మిక గురువు తుది దర్శనం కోసం దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, అనుచరులు తరలివచ్చే అవకాశం ఉందని ట్రస్ట్ వర్గాలు వెల్లడించాయి.

సెప్టెంబరు 30 బుధవారం నుంచి మూడు రోజుల పాటు కల్కి భగవాన్ భౌతికకాయాన్ని ఆశ్రమంలోనే ఉంచనున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు ప్రకటించారు. ఈ సమయంలో భక్తులు, శిష్యులు ఆయనకు నివాళులు అర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చే...