భారతదేశం, ఏప్రిల్ 10 -- కాళేశ్వ‌రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల‌కు మ‌ర‌మ్మ‌త్తులు చేసి వాటిని వినియోగంలోకి తీసుకురావాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. నేష‌న‌ల్ డ్యామ్ సేప్టీ అథారిటీ (NDSA) సూచ‌న‌ల మేర‌కు వీలైనంత త్వ‌ర‌గా ఈ ప‌నుల‌ను వేగవంతం చేయాల‌న్నారు.

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమీక్షించారు. ప్రాజెక్టు మ‌ర‌మ్మ‌త్తుల కోసం ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించి నిరంత‌రం ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

మరమ్మత్తులకు సంబంధించిన ఏజెన్సీల‌న్నింటిని అప్ర‌మ‌త్తం చేసి ప‌నుల్లో వేగం పెంచాల‌ని సూచించారు. సెంట్ర‌ల్ వాట‌ర్ అండ్ ప‌వ‌ర్ రీసెర్చ్ స్టేష‌న్ (CWPRS) ఆధ్య‌ర్యంలో జ‌రుగుతున్...