భారతదేశం, ఏప్రిల్ 24 -- Kajol: బాలీవుడ్ వెండితెరపై మూడు దశాబ్దాలుగా ఓ వెలుగు వెలుగుతున్న నటి కాజోల్. తన కెరీర్‌లో ఎప్పుడూ పాటించిన 'నో-కిస్సింగ్' పాలసీని 'ద ట్రయల్' వెబ్ సిరీస్ కోసం పక్కన పెట్టారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ నిర్ణయం వెనుక ఉన్న బలమైన కారణాన్ని ఆమె వెల్లడించారు.

'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే', 'కుచ్ కుచ్ హోతా హై' వంటి ఎన్నో ఐకానిక్ చిత్రాల్లో నటించిన కాజోల్.. 2023లో 'ద ట్రయల్ - ప్యార్, కానూన్, ధోఖా' సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టారు. ఇందులో తన కో-స్టార్ జిషూ సేన్‌గుప్తాతో ఆమె ఒక ముద్దు సీన్‌లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. లిల్లీ సింగ్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కాజోల్.. ఈ సీన్ చేయడానికి గల కారణాన్ని వివరించారు.

"నిజం చెప్పాలంటే అది నేను పోషించిన పాత్ర డిమాండ్. ఆ పాత్ర (నయోనికా) ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, ఆమె ఏం కోరుకుంటుంద...