భారతదేశం, జూన్ 8 -- Kajal Aggarwal On Ramayana Movie: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న మైథలాజికల్ చిత్రం 'రామాయణం' కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 'దంగల్' ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న విషయం తెలిసిందే.

అలాగే, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడిగా చేస్తున్నాడు. ఈ మహా కావ్యంలో రావణుడి భార్య 'మండోదరి' పాత్రను పోషిస్తున్న టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తాజా ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రసిద్ధ అంతర్జాతీయ పత్రిక 'వెరైటీ ఇండియా'తో ఆమె ముచ్చటించారు.

"ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు సరికొత్త అనుభూతి కలిగింది. ఎందుకంటే ఇది సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రొ...