భారతదేశం, సెప్టెంబర్ 21 -- Kajal Aggarwal: నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం మనుషుల బంధాలపై విపరీతంగా పడుతోందని కాజల్ అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేసింది. "చాలామంది జంటలు కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా సమయం కేటాయించడం లేదు. డిన్నర్ డేట్స్‌కి వెళ్లినా కూడా చేతుల్లో ఫోన్లు పట్టుకుని స్క్రోలింగ్ చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు" అని కాజల్ గుర్తుచేసింది.

నేటి టెక్నాలజీ యుగంలో బంధాలు చాలా వీక్ గా మారిపోయాయి. ఈ విషయాన్ని కాజల్ అగర్వాల్ మరోసారి ప్రస్తావించింది. ఒకరి అభిప్రాయాలను మరొకరు వినే ఓపిక లేకపోవడం, సోషల్ మీడియా అడిక్షన్ వల్ల కపుల్స్ మధ్య బంధం ఉండట్లేదని కాజల్ చెప్పింది. దంపతుల మధ్య అసలు మాటలే ఉండటం లేదని, ఇది చివరికి విడాకులకు దారితీస్తోందని కాజల్ కుండబద్దలు కొట్టింది.

ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం, పెళ్లి బంధం గురించి కూడ...