భారతదేశం, జూలై 28 -- Kajal Aggarwal: టాలీవుడ్ లో తనదైన అందం, అభినయంతో 'చందమామ'గా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తాజాగా 'ది ఇండియా స్టోరీ' మూవీతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది ఈ భామ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాజల్ ఓ షాకింగ్ సంఘటన గురించి చెప్పుకొచ్చంది.

ఒక సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత తన కారవాన్‌లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగిందని కాజల్ అగర్వాల్ వెల్లడించింది. "ఏలాంటి పర్మిషన్ లేకుండా ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి హఠాత్తుగా నా కారవాన్‌లోకి వచ్చాడు. లోపలికి రాగానే అతడు తన షర్ట్ తీసేశాడు'' అని కాజల్ అగర్వాల్ తెలిపింది.

''ఆ వ్యక్తి తన ఛాతీపై వేయించుకున్న నా పేరు టాటూను చూపించాడు. ఆ క్షణంలో తీవ్ర భయాందోళనకు గురయ్యా. నా కాళ్లు చేతులు వణికిపోయాయి" అని కాజల్ ఆ భయణాక క్షణాలన...