భారతదేశం, జూలై 3 -- రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలైంది. వైఎస్ఆర్ కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లి, పెద్దదండ్లూరు గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయనున్న "జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్" (JSW Rayalaseema Integrated Steel Plant) నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం శ్రీకారం చుట్టారు.

జేఎస్‌డబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ స్టీల్ లిమిటెడ్ సంస్థ ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ను సుమారు 1,100 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తోంది. మొత్తం రూ.16,350 కోట్ల భారీ పెట్టుబడితో రెండు విడతలుగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు.

రెండు విడతల నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ఉక్కు కర్మాగారం ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 2 మిలియన్ టన్నులకు (2 MTPA) చేరుకుంటుంది. మార్చి 2028 నాటికి ఈ ప్లాంట్ నుం...