భారతదేశం, ఏప్రిల్ 11 -- కడప జిల్లాలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. ప్రేమతో పేరుతో ఇంటర్ విద్యార్థిని వేధిస్తున్న ఓ ఉన్మాది రెచ్చిపోయి. అత్యంగా దారుణంగా చంపేశాడు. గొంతుకోసి హత్య చేశాడు. ఖాజీపేటలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.

ప్రాథమిక వివరాల ప్రకారం.. నిందితుడు వెంకటేష్ గత కొంతకాలంగా ఇంటర్ విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చేవాడు. అయితే అతని ప్రవర్తన నచ్చని ఆ యువతి పెళ్లి ప్రతిపాదనను నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న వెంకటేష్.. శుక్రవారం యువతి ఇంటికెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేనిది చూసి. యువతిపై దాడి చేసి అత్యంత క్రూరంగా గొంతు కోశాడు.

రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కుమార్తెను కుటుంబ సభ్యులు గమనించి. ఆస్పత్రికి తరలించారు. కడప రిమ్స్‌కు తరలించే ప్రయత్నం చేశారు. కొనఊపిర...