భారతదేశం, మార్చి 17 -- అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. కాబుల్‌లోని మాదకద్రవ్య విముక్తి కేంద్రం (ఆసుపత్రి) లక్ష్యంగా పాకిస్థాన్ సైన్యం సోమవారం వైమానిక దాడులకు తెగబడిందని అఫ్ఘాన్ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ భీకర దాడిలో 400 మందికి పైగా మరణించారని, 200మందికిపైగా ప్రజలు గాయపడ్డారని తాలిబన్లు తెలిపారు. ఇది ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన సంఘటన అని పేర్కొన్నారు.
ఈ దాడిపై అఫ్గానిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి షరాఫత్ జమాన్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు.
"పాక్ జరిపిన దాడుల్లో ఆసుపత్రి పూర్తిగా నేలమట్టమైంది. 200 మందికి (మృతుల సంఖ్యను సవరించకముందు) పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు," అని ఆయన ధృవీకరించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలు ధ్వంసమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.