భారతదేశం, ఆగస్టు 1 -- Kabaddi Player Sheelu Balhara Wife Suicide: అంతర్జాతీయ కబడ్డీ స్టార్, ప్రముఖ క్రీడాకారుడు షీలు బల్హారా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య ముస్కాన్ (23) హర్యానాలోని రోహ్‌తక్ జిల్లా మెహమ్ ప్రాంతంలో ఉన్న తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం (జూలై 31) మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది.

ముస్కాన్‌, షీలు బల్హారా వివాహం డిసెంబర్ 2023లో జరిగింది. వీరికి గతేడాది నవంబర్‌లో 'హార్దిక్' అనే బాబు జన్మించాడు. చిన్నారి పుట్టి ఏడాదైనా కాకముందే ముస్కాన్ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆధారాల సేకరణ కోసం ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించారు. ముస్కాన్ ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆత్మ...