భారతదేశం, నవంబర్ 21 -- K-drama vs C-drama: ఓటీటీలో ఆసియా కంటెంట్ అంటే కేవలం కొరియన్ డ్రామాలు (K-Dramas) మాత్రమే అనే అభిప్రాయం ఉండేది. బీటీఎస్ (BTS) మ్యూజిక్, కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్‌తో పాటు కే-డ్రామాలు మన యువతను విపరీతంగా కట్టిపడేశాయి. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ మారుతోంది.

కొరియన్ సిరీస్‌లకు గట్టి పోటీనిస్తూ చైనీస్ డ్రామాలు (C-Dramas) భారత ప్రేక్షకులకు సరికొత్త అబ్సెషన్‌గా మారుతున్నాయి. వర్క్‌ప్లేస్ కష్టాల నుంచి చారిత్రక ప్రేమకథల వరకు విభిన్నమైన కథనాలతో సీ-డ్రామాలు భారతీయ డిజిటల్ మార్కెట్‌లో దూసుకుపోతున్నాయి.

కేవలం ప్రేమకథలే కాకుండా ఆధునిక కార్పొరేట్ ఒత్తిళ్లు, చారిత్రక నేపథ్యం, మొబైల్ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందుతున్న 'మైక్రోడ్రామాలు' (Microdramas) యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇటీవల కాలంలో పలు చైనీస్ వెబ్ సిరీస్‌లు భారత స్ట్...